- ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్న
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : యుతవ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్నసూచించారు. నగరంలోని ఆటో నగర్ లో గల డ్రైవర్స్ కాలనీలో శుక్రవారం మత్తు పదార్థాల వినియోగం వల్లే కలిగే పరిణామలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులు పిల్లల కదలికను గమనిస్తూ ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు విక్రయిస్తే సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.