మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ యువతకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల నివారణపై సీఎస్ఐ చర్చ్ గ్రౌండ్ నుంచి కళాభారతి ఆడిటోరియం  వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కళాభారతి ఆడిటోరియం వద్ద కలెక్టర్, ఎస్పీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్​, మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు....