Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 June 2025, 5:18 pm Posted by : ramakrishna

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

కమ్మర్ పల్లీ, బతుకమ్మ: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కమ్మర్ పల్లీ ఎస్సై అనిల్ రెడ్డి అన్నారు. కమ్మర్ పల్లీ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఎస్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వలన కలిగే నష్టాలను గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ  చేయించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.