Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 July 2025, 5:25 pm Posted by : ramakrishna

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి పోస్టర్ల అవిష్కరణ

 కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఆదేశాల మేరకు పారా లీగల్ వాలంటీర్‌ బెండి విజయ్ కుమార్ “మత్తుపదార్థాల నుండి దూరంగా ఉండండి” అనే సందేశంతో అవగాహన పోష్టర్ లను రూపొందించారు. ఈ సందేశ పోస్టర్లను కామారెడ్డి పట్టణ సిఐ నరహరి పోలీస్ సిబ్బంది సమక్షంలో విడుదల చేశారు. చౌరస్తాలో ట్రాఫిక్ ఎస్‌ఐ , కానిస్టేబుళ్లతో పాటు స్థానిక ప్రజలు కు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు అతికించి కరపత్రాలను పంపిణీ చేశారు. అధికారులు, సిబ్బంది కలిసి మత్తుపదార్థాల దుష్పరిణామాలపై చైతన్యం కలిగించారు.