మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి
. . . ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ ఎం. సోమనాథం విద్యార్థులకు పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), నిజామాబాద్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం గిర్‌రాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం...