బాల్య వివాహం – బతుకు ఆగం పై రాష్ట్రవ్యాప్త పోరు
. . . తరుణి స్వచ్ఛంద సంస్థ తో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక అడుగు వేసింది. ఈ దిశగా బాలికల సాధికారత, బాల్య వివాహాల నిరోధం, మానవ అక్రమ రవాణా నిరోధం వంటి అంశాల్లో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న తరుణి స్వచ్ఛంద సంస్థతో మహిళా, శిశు సంక్షేమ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది....