. . . మెడికవర్ హాస్పిటల్ (కార్డియోవాస్కులర్ సర్జన్) డా. రాకేష్
నిజామాబాద్ , బతుకమ్మ:
ఉత్తర తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నిజామాబాద్‌లోనే అత్యాధునిక గుండె శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ కార్డియోవాస్కులర్ సర్జన్ డా. రాకేష్ తెలిపారు. ముఖ్యంగా బైపాస్ సర్జరీలు, వాల్వ్ సర్జరీలో ఆధునిక మినిమల్లి ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు యువతలో కూడా వేగంగా పెరుగుతున్నాయని, సమయానికి చికిత్స అందక చాలామంది ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు ఆయన తెలిపారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల్లో బ్లాకేజీలను ఏర్పడినప్పుడు బైపాస్ సర్జరీ ద్వారా గుండెకు కొత్త రక్త ప్రసరణ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. మినిమల్లి ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అనేది సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ తో పోలిస్తే చిన్న గాయాలతో చేసే ఆధునిక శస్త్రచికిత్స విధానమని డా. రాకేష్ తెలిపారు. సాధారణంగా ఛాతిని పూర్తిగా తెరవకుండా చిన్న రంధ్రాల ద్వారా సర్జరీ నిర్వహించడం వల్ల రోగికి నొప్పి తక్కువగా ఉండటంతో పాటు రక్త నష్టం కూడా తగ్గుతుందన్నారు. ఈ విధానంతో రోగులు త్వరగా కోలుకొని తక్కువ రోజుల్లోనే సాధారణ జీవితానికి తిరిగి వెళ్లగలుగుతున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌లో అత్యాధునిక కార్డియాక్ , అనుభవజ్ఞులైన కార్డియాక్ అనస్థీషియా, క్రిటికల్ కేర్ బృందంతో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు అని తెలిపారు. హైదరాబాద్ స్థాయి గుండె వైద్య సేవలు ఇప్పుడు నిజామాబాద్ ప్రజలకు స్థానికంగానే అందుబాటులో ఉండటం ఎంతో ఉపయోగకరమన్నారు.అత్యవసర గుండెపోటు కేసులో ప్రతి నిమిషం కీలకమని, చికిత్స ఆలస్యం అయితే ప్రాణాపాయం పెరుగుతుందని డా. రాకేష్ పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో నిజామాబాద్‌లోనే అత్యవసర గుండె చికిత్సలు అందించడం వల్ల అనేక మంది రోగుల ప్రాణాలు కాపాడగలుగుతున్నామని తెలిపారు. బైపాస్ సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆధునిక సాంకేతికతతో సర్జరీలు అత్యంత సురక్షితంగా జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా మధుమేహం మరియు బహుళ బ్లాకేజీలను ఉన్న రోగులకు బైపాస్ సర్జరీ దీర్ఘకాలికంగా మెరుగైన ఫలితాలు ఇస్తుందని వివరించారు.మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌లో యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీలు, మినిమల్లి ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ , పోస్ట్ కార్డియాక్ రిహాబిలిటేషన్ సేవలు ఒకేచోట అందిస్తున్నామని తెలిపారు.ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అత్యాధునిక గుండె వైద్యం ఇప్పుడు నిజామాబాద్‌లోనే మెడికోవర్ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉందని డా. రాకేష్ తెలిపారు.