మురికివాడల్లో పోలియో చుక్కల పంపిణీని పర్యవేక్షించిన రాష్ట్ర పరిశీలకులు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇంటింటి సర్వే, పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ సి. వెంకటరమణ సోమవారం పర్యవేక్షించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని పూలాంగ్ బ్రిడ్జి సమీపంలోని మురికివాడలో గృహ సందర్శన నిర్వహించారు. బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయించుకోని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి వారి ఇళ్ల వద్దే పోలియో చుక్కలు వేయించారు....