Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 7:50 pm Posted by : ramakrishna

ఆత్మకూరు విద్యార్థినికి రాష్ట్రస్థాయి ర్యాంకు

బతుకమ్మ,నాగిరెడ్డిపేట : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన విద్యార్థిని కులకర్ణి స్ఫూర్తి 462 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ఏడవ ర్యాంకు సాధించింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ లో 470 మార్కులకు గాను 462 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ఏడవ ర్యాంక్ సాధించినట్లు విద్యార్థిని తండ్రి కులకర్ణి చంద్రశేఖర రావు తెలిపారు. కులకర్ణి స్ఫూర్తి పదవ తరగతి వరకు ఎల్లారెడ్డి లోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదివి ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోని ఎస్ ఆర్ గాయత్రి ప్రైవేట్ కళాశాలలో చదువుతోంది. కులకర్ణి స్ఫూర్తి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో రాష్ట్ర స్థాయి ఏడవ ర్యాంకు సాధించడం పట్ల విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు, విద్యార్థిని పూర్వ పాఠశాల ఉపాధ్యాయులు., మండల విద్యావంతులు స్ఫూర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తున్నారు.

State-level rank for Atmakur student