నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రిఫరీ బోర్డు ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ సంఘం సహకారంతో నగరంలోని విజ్ఞాన్ హై స్కూల్ లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర రెఫరీ బోర్డ్ పరీక్షలు నిర్వహించినట్టు రెఫరీ బోర్డ్ కన్వీనర్ అనిల్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాసాని వీరేష్, మద్ది మహేందర్ రెడ్డి ల ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహించినట్టు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి పలు జిల్లాలకు సంబంధించిన వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని రాష్ట్రస్థాయిలో జరిగే టోర్నమెంట్ లో బాధ్యతలు నిర్వహించే విధంగా అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరిశీలకులు రిఫరీ బోర్డు కన్వీనర్ అనిల్ కుమార్, అంతర్జాతీయ స్థాయి ప్రో కబడ్డీ ఎంపైర్ శ్రీనివాస్, జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు పరీక్ష అబ్జర్వర్ ఆంధ్యాల లింగయ్య, కార్యదర్శి గంగారెడ్డి , కోశాధికారి సురేందర్, సాయగౌడ్, మీసాల ప్రశాంత్, సునీల్, వీరస్వామి, అనురాధ, కవిత, సాయిలు పలువురు పాల్గొన్నారు.