Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2025, 8:22 pm Posted by : ramakrishna

నేటి నుంచి రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ రాష్ట్రస్థాయి హాకీ ఛాంపియన్షిప్ పోటీలు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించనున్నారని స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యులు ఏ గోపి తెలిపారు. పోటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎస్ సి రాపల్లి రవీందర్ సభా అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎస్ ఈ ఆపరేషన్ కామారెడ్డి శ్రావణ్ కుమార్, ఎస్ సి ఓ ఎం సి పివి రావు, రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలోని డివిజన్ ఇంజనీర్లు ,సీనియర్ అకౌంట్ ఆఫీసర్స్ హాజరవుతారని అన్నారు. నిజాంబాద్ జిల్లా విద్యుత్ ఉద్యోగులు ఎంప్లాయిస్ పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.

State level hockey tournament from today