లెనిన్ క్లబ్ షోరూంను సందర్శించిన రాష్ట్ర నాయకులు

బతుకమ్మ: బిచ్కుంద : బిచ్కుంద గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి కమల్ కిషోర్ బట్టడ్ హైదరాబాద్ లోని మేడ్చల్ లో ఇటీవల నూతనంగా ప్రారంభించిన లెనిన్ క్లబ్ షోరూంను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అనంతరం వారికి శాలువాతో సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.