Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 7:57 pm Posted by : ramakrishna

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో పాత బస్సు స్టాండ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం లో సుమారు 18 దుకాణాలు అగ్నికి అహుతి అయినా సంగతి తెలిసిందే. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రమాద స్థలిని పరిశీలించి అగ్ని ప్రమాదంలో ఆస్థి కోల్పోయిన వ్యాపారులను పరామర్శించారు. అనంతరం వారిని ఆదుకోవడానికి తక్షణ సహాయంగా ఆర్ధిక సహాయం చేసారు.

 

State government advisor visits fire victims

 

బాధితులకు ప్రభుత్వం ద్వారా తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, కౌన్సిలర్లు షేరు, అన్వార్, వాజీద్, సిద్దిక్, గంప ప్రసాద్, ఆర్డీవో, ఎమ్మార్వో, మున్సిపల్ కమీషనర్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 

State government advisor visits fire victims