Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 6:29 pm Posted by : ramakrishna

మాక్లూర్ పీహెచ్సీ ని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు

 

మాక్లూర్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ జిల్లాలోని మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అందించే సేవలు అన్నింటిని పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఏ విధంగా సేవలందిస్తున్నారని పరిశీలించి సమీక్షించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో 12 రకాల ప్రోగ్రాములు ప్రధానమైనవని సుమారు 35 రకాల జాతీ ఆరోగ్య కార్యక్రమాల సేవలు అందించబడతాయన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందించే సేవలు ప్రధానమైనవి ఫార్మసీ, ల్యాబ్ సేవలు, మాతా శిశు ఆరోగ్యం సేవలు, ఓపి సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సరిపడా మందుల నిలువ ఉంచుకోవాలని, రోగుల వద్ద నుండి శాంపిల్స్ సేకరించి రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని, టి హబ్ నకు  శాంపిల్స్ పంపియాలని తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు మాత శిశు ఆరోగ్య సేవలు అందించడమే కాకుండా సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలని అన్నారు. ఓపి రోగుల సంఖ్యను పెంచాలని కోరారు. పీఏస్సీ ప్రాంగణంలో నిర్మించిన యోగ కేంద్రంలో ప్రతిరోజు యోగా చేసేలా ప్రణాళికలు రచించాలని తెలియజేశారు.ఈ సందర్భంగా అందిస్తున్న సేవలపై పలు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి వచ్చే రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరోగ్య సేవలో అందించాలని అన్నారు. తద్వారా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించాలని సూచించారు.

State Director of Medical and Health Services conducts surprise inspection of Makloor PHC