Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 July 2025, 9:29 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు

భీమ్ గల్, బతుకమ్మ :  మండలం లోని రహత్ నగర్ గ్రామం లో ఇటీవల కరెంటు షాక్ తో మృతి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త,రైతు ధరావత్ రామ్ సింగ్ కుటుంబాన్ని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డిలు ఆదివారం పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన వారు ఈ సందర్బంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వారి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొదిరే స్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,ఎస్సీ సెల్ అధ్యక్షులు అనంతరావు, ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్,బీసీ సెల్ అధ్యక్షులు రాజు,యువజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, జిల్లా బంజారా నాయకులు చంద్రు నాయక్,ముచ్కూర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్,వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి,వైస్ చైర్మన్ నర్సారెడ్డి,బాల్కొండ మండల ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్,ముప్కల్ మండల ప్రెసిడెంట్ ముత్యం రెడ్డి,బ్లాక్ అధ్యక్షులు గంగ ప్రసాద్,సేవాలాల్,అవినాష్, సురేష్,సామ్ రాజ్ ,శ్రీను,శ్రీకాంత్,రాజేష్,కిషన్,గంగాధర్,జేమ్స్,రాజు,రవి,గోపాల్,సాయిలు,నరసయ్,గంగారం,రమేష్,రాములు తదితరులు పాల్గొన్నారు.