Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2024, 12:27 pm Posted by : ramakrishna

16, 17తేదీల్లో  రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ

నిజామాబాద్, బతుకమ్మ: ఈనెల 16, 17 తేదీల్లో నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ర్టస్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహించనున్నట్లు క్లబ్ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తెలిపారు. శనివారం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 35సంవత్సరాల నుంచి మొదలుకుని 70 సంవత్సరాల వరకు వివిధ వయస్సుల వారికి ఈ టోర్నీ నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ర్టవ్యాప్తంగా 300 జట్లు పాల్గొనే ఈ టోర్నీ నిర్వహణ వల్ల జిల్లాకు మంచి పేరు రావడంతోపాటు ఆఫీసర్స్ క్లబ్ కు గుర్తింపు వస్తుందన్నారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ తోపాటు క్యాపిన్ బ్యాడ్మింటన్ హబ్ లో ఈ పోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టోర్నీ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి సత్యనారాయణ, మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు, భక్తవత్సలం, భవంతి దేవీదాస్, ఏటీఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.