Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2024, 4:49 pm Posted by : ramakrishna

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

బతుకమ్మ, బాల్కొండ, మెండోరా: మెండోరా మండల కేంద్రంలో సావెల్ సహకార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వరి కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ రాజారెడ్డి ప్రారంభించారు. వేంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో వారి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన 33 రకాల సన్నాలకు రూ. 500 అదనంగా రైతులు పొందాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.