ఏప్రిల్ 16న స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ కార్యక్రమం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఉదయం 8:30 గంటల నుండి 11:30 వరకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఫిర్యాదులు అందజేయాలని కమిషనర్ తెలిపారు. ఇంటి పన్నులు, కొత్త ఇంటి నెంబర్, నల్ల కనెక్షన్లు, వీధి కుక్కల బెడద, ఇంటి పన్ను తగ్గింపు, దోమల నివారణ, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం,...