నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఉదయం 8:30 గంటల నుండి 11:30 వరకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఫిర్యాదులు అందజేయాలని కమిషనర్ తెలిపారు. ఇంటి పన్నులు, కొత్త ఇంటి నెంబర్, నల్ల కనెక్షన్లు, వీధి కుక్కల బెడద, ఇంటి పన్ను తగ్గింపు, దోమల నివారణ, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ మహిళా శక్తి బ్యాంకు లింకేజి, కొత్త రేషన్ కార్డులు, చేయూత పథకం, పేరు మార్పిడి, డ్రైనేజీ సమస్యలు, ఇంటి నిర్మాణ అనుమతులు వంటి వివిధ రకాల సమస్యలను ఈ కార్యక్రమంలో పరిష్కరించుకోవాలని వారు కోరారు.
