. . . కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తుండగా కారు స్కూల్ వ్యాన్ కు ఢీ
వెబ్ డెస్క్, బతుకమ్మ :
సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తన కుటుంబ సభ్యులతో దైవదర్శనానికి వెళ్తున్నకారులో ఎదురుగా వస్తున్న స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూర్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. తెలంగాణ రెవెన్యూ,స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్ పెక్టర్ జనరల్ (ఐజీ), సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యలో నెల్లూర్ జిల్లా చాపరాళ్ళపల్లి సమీపంలోకి రాగానే కలెక్టర్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఒక స్కూల్ వ్యాన్ ను బలంగా ఢీకొట్టింది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతోపాటు కారులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాజీవ్ గాంధీ హనుమంతు కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ కు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.