Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2025, 8:02 pm Posted by : ramakrishna

సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలి

  • డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వసతులను సిబ్బంది సక్రమంగా వినియోగించుకుంటూ, మరింత సమర్థవంతంగా పని చేసి బ్యాంకు అభివృద్ధి కి దోహదపడాలని డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి సూచించారు. బ్యాంకు ప్రధాన కార్యాలయం లో నూతనంగా నిర్మించిన రెండవ అంతస్తు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించి, రెండవ అంతస్తు భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు నిధులతో సుమారు కోటి నలభై లక్షల రూపాయల వ్యయంతో సకల ఆధునిక వసతులతో కూడిన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.  నూతన వసతులు సిబ్బంది ఉత్పాదకతను పెంచేలా, మరింత సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని కల్పిస్థాయి అని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే, జిల్లా సహకార అధికారి శ్రీనివాస రావు, టీజీసీఏబీ జనరల్ మేనేజర్ సురేఖ, ఉన్నతాధికారులు, శాఖాధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.