మనోరమలో అనుమానాస్పద స్థితిలో స్టాఫ్ నర్సు మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆసుపత్రి మనోరమలో స్టాఫ్ నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన శనివారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా డొంగిల్ కు చెందిన శిల్ప (27) మనోరమ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహించగా శిల్ప విశ్రాంతి తీసుకుంటానని చెప్పి ఆసుపత్రిలోనే నిద్రించింది. ఉదయం తోటి సిబ్బంది శిల్పను నిద్ర లేపేందుకు...