Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 9:09 am Posted by : ramakrishna

నిండుకుండాలా ఎస్సారెస్పీ

 

 . . . ఉదయం వరధ గేట్లు ఎత్తి నీటిని విఢుధలకు సన్నహాలు

. . . అప్రమత్తంగా ఉండాలని పరివాహక ప్రాంతాల ప్రజలకు సూచన

 మెండోరా, బతుకమ్మ :

శ్రీరాం సాగర్ ప్రాజేక్టు నిండుకుండలా మారింది. ప్రాజేక్టుకు ఎగువ బాగంలో గోదావరి, మంజీరా, హరిధ్రా నదుల నుంచి వరధ పోటేత్తడంతో 1,51,932 క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తుంది. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1088 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు సామార్థ్యం 80.5 టియంసీలకు గాను 72.61 టియంసీలు గా ఉంది. ప్రాజెక్టుకు లక్షన్నర క్యూసెక్కుల వరధ వస్తుండటం, నిజాం సాగర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలడంతో ప్రాజేక్టుకు మరింత వరధ పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గెట్లను ఎత్తి నీటిని దిగువకువిడుధల చేస్తామని ప్రకటించారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , నదిలో చెపల వేటకు వెళ్లవద్ధని, సంధర్శకులకు అనుమతి లేదని, పశువుల కాపరులు పరివాహక ప్రాంతాలకు వెల్లవద్ధని అధికారులుహెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ద్వార 15,825 క్యూసెక్కుల నీటి విడుధల కోనసాగుతుంది.