Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2025, 6:26 pm Posted by : ramakrishna

ఎస్సారెస్పీ గేట్లు మూసివేత

మెండోరా, బతుకమ్మ:ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా తగ్గడంతో  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లను గురువారం మూసివేసినట్లు ప్రాజెక్ట్ డిఈ ఈ గణేష్ తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 1091.00 అడుగులు, 80.501 టిఎంసిల నీరు ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతుందని తెలియజేశారు.