ఎస్సారెస్పీ గేట్లు మూసివేత
మెండోరా, బతుకమ్మ: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా తగ్గడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లను సోమవారం మూసివేసినట్లు ప్రాజెక్ట్ డిఈ ఈ గణేష్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 29,907 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టిఎంసిలు కాగా గురువారం ఉదయం ప్రాజెక్టులో 1090.90 అడుగులు, 80.053టిఎంసిల నీరు ఉంది. వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులు, కాకతీయ 3500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4500 క్యూసెక్కులు, సరస్వతి...