Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 1:45 pm Posted by : ramakrishna

ఇంటర్ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ విద్యార్థుల హవా

. ఎంపీసీ, ఒకేషనల్ లో సత్తా
నిజామాబాద్, బతుకమ్మ: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. సెకండియర్ ఎంపీసీలో నాగిశెట్టి విష్ణు 959/1000, శ్రీరామ్ వెంకటేశ్ 949/1000 మార్కులు సాధించారు. అలాగే ఫస్టియర్ ఒకేషనల్ ఎంఎల్టీలో అర్బియానాజ్ 483/500, అబ్దుల్ నబీర్ 469/500 మార్కులు సాధించారు. ఎంపీహెచ్ డబ్ల్యూ(ఎఫ్) సెకండియర్ లో సంగెం సుమ 450/500 మార్కులు సాధించి రాష్టస్థాయి ర్యాంకు కైవసంచేసుకుంది.


SSR students' performance in Inter results
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎం మారయ్యగౌడ్ అభినందించారు. క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన చదువును తమ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తాయని ఆయన అన్నారు. నాన్ రెసిడెన్షియల్ కళాశాలలో రాష్ట్ర, జిల్లా స్థాయి మార్కులను తమ కళాశాల విద్యార్థులు సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఎం హర్షిత్ గౌడ్, ప్రిన్సిపాల్ రవీందర్ గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.