నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : ఎస్ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ సీబీఎస్ఈ స్కూల్స్ — ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్, మాధవనగర్, నిజామాబాద్, ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్, జన్నేపల్లి విద్యార్థులు సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి 100% ఉత్తీర్ణత, జిల్లా టాప్ స్కోరు సాధించారని ఎస్ఎస్ఆర్ గ్రూప్ ఛైర్మన్ డా.మరయ్య గౌడ్, సీఈఓ హరిత గౌడ్ తెలిపారు. కనక్ ఇనాని 476/500 మార్కులతో జిల్లా టాపర్ గా నిలిచిందని అన్నారు. రిచా బజాజ్ 465 మార్కులు, సహస్వి శ్రీరాం 451 మార్కులు, సంవేద్య 449 మార్కులు, సహస్ర 448 మార్కులు, శ్రీవేణు 446మార్కులు, శివ చైతన్య 444 మార్కులు, నవ్య 443 మార్కులు, కీర్తి రెడ్డి 441 మార్కులు, యోషిత్ రెడ్డి 439 మార్కులు సాధించారని తెలిపారు. ముగ్గురు విద్యార్థులు 95% కంటే ఎక్కువ మార్కులు, 24 మంది విద్యార్థులు 90% కంటే ఎక్కువ మార్కులు, 34 మంది విద్యార్థులు 80% కంటే ఎక్కువ మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగావిద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపకులను వారి అంకితభావం, అసాధారణ విజయాలకుగాను అభినందించారు.