నిజామాబాద్, బతుకమ్మ: చెన్నైలో జరుగుతున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థి ఎం.కె.అఖిల్ ఎంపికైనట్లు ప్రన్సిపాల్ డా.ఎం.మారయ్యగౌడ్ తెలిపారు. అఖిల్ గతంలో ఎస్ఎంఆర్ మెమొరియల్ టోర్నమెంట్ 2021 విన్నర్ టీంలో సభ్యుడని తెలిపారు. అండర్ 16 ఎచ్ సీఏ 2022 హైదరాబాద్, అండర్ 17 నిజామాబాద్ టోర్నమెంట్ 2023, అండర్ 19 ఎస్జీఎఫ్ 2023 గద్వాల్ క్రికెట్ టోర్నమెంట్ లలో ప్రతిభ చాటాడని తెలిపారు. చెన్నైలో కూడా బాగా ఆడి భవిష్యత్తులో మరింత రాణించి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు.