👉 మహిళా కానిస్టేబుల్ తో పాటు చెరువులో దూకి ఆత్మహత్య
👉 గాలిస్తున్న జిల్లా పోలీసు అధికార యంత్రాంగం
నిజామాబాద్ ,బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో ఒక ఎస్సై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో మహిళ కానిస్టేబుల్ తో పాటు చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లా పోలీస్ బాస్ తోపాటు పోలీస్ అధికారి యంత్రాంగం కామారెడ్డి పట్టణ శివారులోని చెరువులో డెడ్ బాడీ ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు చెరువు వద్ద ఎస్సై తో పాటు మరో మహిళ కానిస్టేబుల్ సంబంధించిన సెల్ ఫోన్ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గజ ఈతగాళ్లతో డెడ్ బాడీల కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. డెడ్ బాడీ లు దొరికితే గాని ఆత్మహత్యలకు కారణాలు ఏమిటి.. అసలు రెండు ఆత్మహత్యలు జరిగాయా లేవా అని వెలుగు చూసే అవకాశం ఉంది. అయితే ఎస్ఐ, కానిస్టేబుల్ ఫోన్లతో పాటు సంఘటన స్థలంలో మరో ఫోన్ లభ్యమైంది. దీంతో అక్కడ మరో వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడా.. అయితే ఆ మూడో వ్యక్తి ఎవరు..?