Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 1:27 pm Posted by : ramakrishna

ఎస్సెస్సీ స్పాట్ రేట్లు పెంచాలి

 

.  .  .  గత సంవత్సరం స్పాట్ బకాయిలు విడుదల చేయాలి

 

. . . పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

గత 2018 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం స్పాట్ రేట్లను సవరించి ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ అవే రేట్లు అమల్లో ఉన్నాయని, ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం రేట్లు రెండు సంవత్సరాలు పెంచారని, పదో తరగతి మూల్యాంకనం రేట్లను ఆ మేరకు సవరించాల్సిన అవసరం ఉందని పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం అవుతున్నందున అంతకుముందే ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు స్పాట్ రేట్ల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని కోరారు. అంతే కాకుండా గత సంవత్సరం మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు తక్షణమే చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అయన డిమాండ్ చేశారు.