ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :ప్రభుత్వం తక్షణమే స్పందించి శ్రమ దోపిడీకి గురవుతున్నఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ.రమేష్, డి.సత్యానంద్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద 14 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు శుక్రవారం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎం.మల్లేష్ పాల్గొన్నారు.