Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 5:09 pm Posted by : ramakrishna

యాసంగి పంటకు ఎస్ ఆర్ ఎస్ పీ నీటి విడుదలకు ప్రణాళిక సిద్ధం

 

. . . 24 నుంచి  కాలువల ద్వారా వారబంది ప్రకారం నీటి విడుదల

 మెండోరా, బతుకమ్మ :

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా యాసంగి పంటకు ప్రణాళిక సిద్ధం చేసిన ప్రకారం నీటి విడుదల చేయడం జరుగుతుందని ప్రాజెక్టు ఏస్ ఈ జగదీశ్ తెలిపారు. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో 3 న జరిగిన  (ఎస్సిఐడబ్ల్యుఎఏం) కమిటీ నిర్ణయించిన ప్రకారం ఈ నెల 24 నుంచి ఉదయం 10 గంటలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ, సరస్వతి ,లక్ష్మీ కాలువల ద్వారా ఈ సంవత్సరం యాసంగి పంటకు సాగు నీటి  విడుదల ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎస్సిఐడబ్ల్యుఎఏం కమిటీ  నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు పరిధిలోని  ఆయకట్టుకు వారబంది పద్ధతిలో సాగు నీటి విడుదల కొనసాగించబడుతుంది అన్నారు. సాగు నీటిని వృధా కాకుండా పొదుపుగా వాడుకునే సహకరించాలని రైతులందరికీ ప్రాజెక్ట్ ఎస్ఏ విజ్ఞప్తి చేశారు.