మెండోరా, బతుకమ్మ:శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తి గోదావరిలోకి 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి రవి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టు లోకి 22,299 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాకతీయ కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,000 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.501 టిఎంసిల నీరు ఉంది.