Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 August 2025, 5:07 pm Posted by : ramakrishna

ఎస్ ఆర్ ఎస్పీ 25 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల

మెండోరా, బతుకమ్మ:

 ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి జలకళ సంతరించుకుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు బుధవారం ఎస్సారెస్పీ 25 గేట్లు నెత్తి లక్ష క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. వరద కాలువ, కాకతీయ, సరస్వతి, లక్ష్మి, మిషన్ భగీరథ, ఎస్కేప్ గేట్ల ద్వారా మొత్తం 1,30,392 క్యూసెక్కుల అవుట్ ఫ్లో వెళ్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా బుధవారం 1090.70 అడుగులు, 79.263 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

 నిజాం సాగర్ 16 గేట్లు ఎత్తి నీటి విడుదల…

నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఉదయం ప్రాజెక్టులోకి 70 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. మంగళవారం రాత్రి వరకు రెండు గేట్లు ఎత్తిన అధికారులు, 17 టీఎంసీల నీరు పూర్తిస్థాయి నీటిమట్టం  ఉండటంతో 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాయంత్రానికి 78,406 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో  1,52,848 క్యూసెక్కుల నీటిని గేట్లు మొత్తం ఎత్తి దిగువకు వదులుతున్నారు.

SRSP lifts 25 gates and releases water into Godavari