Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2025, 9:14 pm Posted by : ramakrishna

ఎస్ఆర్ఎస్పీ ముంపు, వరద బాధితుల సమావేశం

  • 5న నవీపేట్ లోని రఘుపతి రెడ్డి కల్యాణ మండపంలో
  • వరద వాస్తవాలు, కార్యాచరణకై చర్చ

 

నిజామాబాద్, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పి) పైన ముంపు, వరదకు కారణాలపై చర్చించి, సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసేందుకు బాధిత గ్రామాలు, రైతులు స్వచందంగా కదిలి రావాలని న్యాయవాది బి.మనోహర్ (మాజీ డీఎస్పి) కోరారు. ఆదివారం (ఈనెల 5న ) నవీపేట్ మండల కేద్రంలోని రఘుపతి రెడ్డి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో బోధన్, ముదోల్, ఆర్మూర్, నిర్మల్, బాన్సవాడ నియోజకవర్గంలోని వరద ముంపు గ్రామాల ప్రజలు, రైతులు రావాలని కోరారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుపైన ఉన్న గ్రామాలు, పంట పొలాలు ఎప్పుడులేని విధంగా ముంపునకు గురి అవుతున్నాయి. దీనిపై కారణాలను విశ్లేషణ చేసి సమస్య పరిష్కారానికి ఒక చర్చ చేయాలని కోరారు. వాస్తవాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేద్దామని కోరారు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు, అధికారులకు వాస్తవాలను తెలియజేస్తూ వినతి పత్రాలు ఇవ్వాలని అన్నారు. అందుకు వరద ముంపు బాధిత గ్రామాల ప్రజలు, రైతులు స్వచందంగా తరలి రావాలని కోరారు.

  • నష్ట పరిహారం కోరడం హక్కు…

ఎప్పుడులేని విధంగా వరద రావడం, ముంపునకు గురి కావడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో బాధితులు నష్ట పరిహారం కోరడం మన హక్కు. అలాగే ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాన్ని కోరాలి. అయితే దీనిపై కొన్ని స్థానికంగా జరిగిన తప్పిదలను గుర్తించడం జరిగింది. వీటిపై చర్చించి వాస్తవాలను ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని మనోహర్ తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు సమావేశానికి హాజరై చర్చించాలని కోరారు.