Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2025, 7:12 pm Posted by : ramakrishna

ఎస్సారెస్పీ గేట్లు మూసివేత

మెండోరా, బతుకమ్మ : 

 

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా తగ్గడంతో  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లను ఆదివారం మూసివేసినట్లు ప్రాజెక్ట్ డిఈ ఈ గణేష్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సార్ఎస్పీలోకి 9454 క్యూసెక్కుల నీరు వస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 1091.00 అడుగులు, 80.501 టిఎంసిల నీరు ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతుందని తెలియజేశారు.