- ముందుగా గర్భలయంలో కల్యాణ క్రతువు
- కన్నులు చాలావన్నట్లుగా కల్యాణ మంటపంలో శ్రీ లక్ష్మీనర్సింహుల కళ్యాణం
- శ్రీవారికి సర్వసమాజ్ కమిటీ పట్టు వస్త్రాల సమర్పణ
- లింబాద్రిగుట్టకు తరలివచ్చిన అశేష భక్తజనం
భీమ్ గల్, బతుకమ్మ : ప్రతియేటా కార్తీక మాసంలో నిర్వహించే లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మీనరసింహుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం ఆలయ అర్చకులు శ్రీవారి కళ్యాణన్ని కన్నుల పండువుల నిర్వహించారు. లోకాకళ్యానార్థం, కలియుగ దైవం అయిన శ్రీ లక్మీ నరసింహుని కళ్యాణంను ముందుగా స్వామి గర్భలయంలో సాంప్రదాయనుసారం మూల విరాట్ కు అర్చకులు కళ్యాణం జరిపించారు.అర్చకులు, స్వర్ణాభరణలంకరుతులైన శ్రీవారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి మంగళవాయిద్యాల చప్పుల్ల మధ్య గోవిందా నామస్మరణతో కింద కల్యాణ మంటపానికి తీసుకువచ్చారు. అఖిలండాకోటి బ్రహ్మాండ నాయకుని కల్యాణ క్రతువును వీక్షించి తరించేందుకు వచ్చిన అశేష భక్త జనవాహిణి కన్నులరా చూస్తుండగా కల్యాణ మంటపంలో లింబాద్రయ్య, లక్ష్మమ్మల కల్యానాన్ని అర్చకులు చూడడానికి కన్నులు చాలావన్న చందంగా నిర్వహించారు. కల్యాణ క్రతువులో భాగంగా అనుహవం యుంజాన ప్రథమం అను శాకునాది మంత్రములను ఉచ్చరించుచు తీసుకుని వచ్చారు.

కల్యాణ ఉత్సవం లో మొదటిదైన కలశ పూజ, విశ్వక్షేన పూజ నిర్వహించి శ్రీ లక్మీ నృసింహులకు రక్షా బంధనము గావించారు. మంత్ర సంస్కార మోనర్చిన యాగ్నోపవిత ధారణ గావించి ఆయన పాద చిహ్నం గల శఠ గోపమునకు ప్రతద్విష్ణు అనే మంత్రముచే పాద ప్రక్షాళన గావించి స్నానమోనరించారు. వారిరువురి గోత్ర ప్రవరలను ఉచ్చారణ జేసి, పెరుగు, తేనె, మధు పర్కమును కలిపి స్వామి వారికి తాగించి కన్యాదాన సంకల్పక్రతువును నిర్వహించారు.ఈ సందర్బంగా అర్చకులు కన్యాదానం చేసిన పితరులు నరకమును వీడి పుణ్యలోకము చేరుకుందురని, కన్యాదాన వైభవం తిలకించిన సమస్త భక్తులకు పుణ్యలోక ప్రాప్తి దొరుకుతుందని భక్తులకు వివరించారు. కన్యాదానం లో భాగంగా శ్రీ లక్మీ నరసింహుని దోసిలిపై శ్రీ లక్మీ దేవి యొక్క దోసిలి ని ఉంచినామను భావనచే అర్చక స్వాములు తమ తమ దోసిలిలో కన్యాం కనక సంపన్నాం అనే శ్లోకములు పటించుచు సంతత ధార జలముచే స్వామి వారికి అమ్మవారిని కన్యాదానం జేశారు. అనంతరం తదేవ లగ్నం సుదినం తదేవా… తారబలం చంద్ర బలం తధావ అంటు శ్రీ నృసింహుని, శ్రీ లక్మీ దేవిని ఒకరికి ఎదురుగా ఒక్కరిని స్వస్తిక చిహ్నములు గల కల్యాణ పీఠలపై కూర్చుండ బెట్టారు. ఇద్దరి మధ్య వస్త్ర తెర ఉంచి మంగళ వాయిద్యాలు మొగుతుండగా తదేవ లగ్నం సుదినం తదేవ అంటు వేద మంత్రోత్సవాల మధ్య,వివాహ మంగళాష్టకములు జపిస్తూ ఆయన పాదములైన శఠగోపముపై ముత్యాలతో కూడిన తలంబ్రాలను సమర్పించారు. విశ్వ సృష్టి లయ కారకుడైన శ్రీలక్ష్మి నారాయణుని మీద తలంబ్రాలు వేసే అధికారం మానవ మాత్రులకు లేనందున ఆయన పాదాలపై తలంబ్రాలు సమర్పించారు. తధానంతరం అక్షింతలను సమర్పణ చేసి ధ్రువంతే రాజా వరుణ అను మంత్రముచే శఠగోపముపై జీలకర్ర,బెల్లం కలిపిన ముద్దను ప్రధాన అర్చకులు, ఆలయ ధర్మకర్తలు సమర్పించారు. పట్టు వస్త్రాలు, పూల బాషింగాలు, బంగారు బాషింగాలు చేర్చి మంగళ వాయిద్యాలు మొగుతుండగా స్వామి కి సమర్పణ చేశారు. మాంగల్యం తంతు నానేన మమజీవన హేతునాం అంటూ సంకల్ప యుక్తంగా మాంగల్య పూజ గావించారు. సుహాసినిలు, సమస్త భక్తులు,పవిత్ర మైన మాంగళ్యమును మొక్కుతుండగా శుభ ప్రదమైన మంగళ వాయిద్యాలు మొగుతుండగా మాంగల్య తంతునానేన అను శ్లోకం ను వేద పండితులు పటించుచుండగా శ్రీ లక్మీ నృసింహుల వారు తన దేవియైన అమ్మ వారి మేడలో మంగళ సూత్రము కట్టారు. వదూవరులు ఒకరి శిరస్సు పై ఒకరు దోసిలి తో అక్షింతలు పోసుకున్నారు. దీనిని అక్షత రోపణము అంటారు. అర్చకులు శ్రీ స్వామి శఠగోపము పై మంత్రములను నుచ్చరించుచు శ్రీ స్వామి తరపున అక్షతలు సమర్పించారు. తదుపరి బ్రహ్మముడి వేశారు. ఆశీర్వచనాది పనసలను చదివి కళ్యాణము తిలకించిన భక్తులకు ప్రసాద అక్షింతలు ఇచ్చి అర్చకులు ఆశీర్వదించారు. కల్యాణ వేడుకల అనంతరం రాత్రి కి వివాహ స్థాలీ పాక హోమం నిర్వహించారు. శ్రీ లక్మీ నరసింహుని కల్యాణ మహోత్సవ కార్యక్రమం లో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లోక రక్షకుడైన స్వామి వారి కల్యాణ మహోత్సవంకు సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను తీసుకొచ్చి స్వామీవారికి సమర్పించారు. అధ్యక్షులు నీలం రవి, ఉపాధ్యక్షులు బర్ల మోహన్, కోశాధికారి కారి కాపు కుమ్మరి హరీష్, సెక్రటరీ పర్శ నవీన్, సలహా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
