…పాల్గొన్న ప్రముఖ సీనియర్ నిర్మాతలు దిల్ రాజు శిరీష్ దంపతులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నర్సింగ్ పల్లి ఇందూర్ తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జరిగిన శ్రీవారి కల్యాణంలో గ్రామ ప్రజలు, సినీ నిర్మాత దిల్ రాజు, శిరీష్, ఆలయ ధర్మకర్తలు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి హర్షిత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ కళ్యాణంలో ఆలయ ధర్మకర్త నర్సింహారెడ్డి, కూతురు అల్లుడు శ్రీహరి, కీర్తన లు యజమానులుగా ఉండి శ్రీవారి కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. వేద పండితులు సంపత్ కుమార్ ఆచార్య, రోహిత్ కుమార్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.
