Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2024, 7:39 pm Posted by : ramakrishna

లింబాద్రి గుట్ట సీతానగరి పై శ్రీవారి డోలోత్సవం

భీమ్ గల్, బతుకమ్మ : శ్రీమన్నింబచల లక్ష్మి నృసింహస్వామి గుట్టపై జరుగుతున్న బ్రహ్మోత్సావల్లో భాగంగా గురువారం గుట్ట పై సీతానగరి పై స్వామి వారికి డోలోత్సవ కార్యక్రమంను అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆజగన్నాతుడు ఉయ్యాలలో అర్చకులు అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల పలుమార్లు ఉచ్వాస పవనమంధుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల… ఉయ్యాల అంటూ భక్తితో హరి నామ సంకీర్తనలు చేస్తూ శ్రీవారికి డోలసేవని నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు సీతానగరిపై డోలోత్సవంను ఘనంగా నిర్వహించారు.