సీతానగరిపై శ్రీవారి డోల సేవ
జోల పాట పాడుతూ పరవశించిన భక్త జనులు భీమ్ గల్, బతుకమ్మ : నింబచల లక్ష్మీనర్సింహాస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ అర్చకులు కొండపైన గల సీతానగరిపై శ్రీవారికి డోలసేవను కన్నుల విందుగా జరిపించారు. ఈ సందర్బంగా అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల అంటూ భక్తి సంకీర్తనలతో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు ఆ దేవదేవుని డోలసేవను ఘనంగా నిర్వహించారు. ఈ మధుర ఘట్టాన్ని తిలకించిన భక్తజనం ఆనంద పరవశంతో మునిగి తేలారు. స్వామివారి ఆలయానికి పశ్చిమ వైపున ...