- ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి లింబాద్రి
భీమ్ గల్, బతుకమ్మ : కార్తీక శుక్ల పక్ష పంచమి ఆదివారం అయిన ఈ నెల 26వ తేదీ నుండి లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ వంశ పారం పర్య ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. ప్రతి యేటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుండి నవంబర్ 7 తేదీ వరకు జరుగుతాయన్నారు. ఇందులో భాగంగా ఈనెల 26న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆరంభం సందర్బంగా క్షేత్ర దేవి శ్రీచండిక దేవి (పెదంగంటి ఎల్లమ్మ)కు సారె సమర్పణ, 27 న మధ్యాహ్నం 1.00 కు గ్రామాలయం నుండి శ్రీవారు కొండకు బయలుదేరుతారు. 28 న,దీపారాధన, పుణ్యహవచనం, అంకురార్పణ, 29 న, ధ్వజరోహణం, 30 న శ్రావణ ప్రయుక్త క్షేరాభిషేకం,నృసింహ ఏకాక్షరీహావనం,అన్నకూటోత్సవం, శ్రీవారి కళ్యాణం ఎదురుకోలు, 31 న మధ్యాహ్నం 12.30 కి శ్రీవారి కళ్యాణం, నవంబర్ 1 న విద్ద ఏకాదశి, ఏకాక్షరీహావనం, 2 న ఉపవాస ద్వాదశి, సాయంత్రం 5 గంటలకు గరుడ సేవా, 3న,పారణ త్రయోదశి, వైకుంఠ చతుర్దశి, ప్రభోదోత్సవం, తులసి వివాహం, ఉదయం 11 గంటలకు కొండ ప్రదక్షిణం, 4న,దాత్రీమూలే శ్రీనృసింహ పూజ,దాత్రీ హవనం, సాయంత్రం 5.30 కు సీతానగరం పై డోలాసేవ, 5న,మధ్యాహ్నం 3.00 లకు జాతర, శ్రీవారి రాథోత్సవం, 6న,శేష హోమం, చక్ర తీర్థం, వ్యాస పూజ, పూర్ణహుతి, రాత్రి 7.00 లకు పుష్పయాగం, 7న దేవాతోద్వాసన, ధ్వజవరోహణం,ఉద్వాసన బలి ప్రధానం, కొండబలి, పుష్కరిణి పై డోలోత్సవం,సాయంత్రం అశ్వవాహనం పై శ్రీవారు గ్రామాలయంకు వెంచేయుట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.