నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మోపాల్ మండంలోని నర్సింగ్ పల్లిలో గల ఇందూరు తిరుమల క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుంచి ప్రారంభమవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 20న ప్రారంభమై 26న ముగుస్తాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి ఆశిస్సులు పొందాలని తెలిపారు.
