శ్రీరాంసాగర్ కు లక్షన్నర క్యూసెక్కుల వరద

ప్రాజెక్టులో 65 టీఎంసీల నీరు కాలువల ద్వారా 15 వేల క్యూసెక్కుల నీటి విడుదల   మెండోరా, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వేగంగా నిండుతుంది. ప్రాజెక్టుకు లక్షన్నర క్యూసెక్కుల వరద పోటెత్తింది. శనివారం లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా ఆదివారం అది లక్షన్నరకు చేరింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 80.5 టీఎంసీలకు గాను సాయంత్రానికి 65.867 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇందిరమ్మ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కుల నీటిని...