కన్నుల పండుగగా శ్రీనివాసుని పరిణయం
మోపాల్, బతుకమ్మ : మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి లో గల ఇందూర్ తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం కళ్యాణ వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయం నేపథ్యం తెలుసుకొని తాను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యానని మంత్రి అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవా తత్పరత తో, సమాజ సేవ దృక్పథంతో, సమాజానికి జ్ఞానం...