శ్రీనివాస రామానుజన్ జయంతి
బతుకమ్మ, వేల్పూర్: మండలోని పడగల్ పాఠశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మ్యాథ్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ రామచంద్ర, ఉపాధ్యాయులు పెంట జలంధర్, మాథ్స్ టీచర్ శంకర్, నారాయణ, దాస్, సుమలత, శ్రీవాణి, పిడి జక్క రాజు పాల్గొన్నారు