బతుకమ్మ, పిట్లం : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కాలేజీలో టి పి టి ఎఫ్ కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ హాజరై ప్రసంగించారు . జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతనంగా టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా చింతల లింగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డిని జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి రాష్ట్ర శాఖ పక్షాన అభినందనలు తెలిపారు. ఈ కార్యవర్గ సమావేశంలో సిహెచ్ లక్ష్మి, విజయ శ్రీ, తృప్తి శ్రీనివాస్, హరి సింగ్ నరేందర్, గోపి శ్రీనివాస్, సిహెచ్ ప్రకాష్, కృష్ణ, కృష్ణమూర్తి, హరీష్, కే ఎన్ భగత్ రామా గౌడ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.