ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరిన శ్రీనివాస్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్ కి చెందిన ఓరియంట్ శ్రీనివాస్ వారి అనుచరులతో కలిసి బీజేపీ పార్టీలో చేరారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో ఓరియంట్ శ్రీనివాస్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.