నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వోగా చింతలతాడెం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. 2012లో ఎస్సైగా ఎంపికైన శ్రీనివాస్ ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పని చేశారు. 2021లో సిఐగా ప్రమోషన్ వచ్చింది. నిజామాబాద్ రేంజ్ ఏసీబీలో నాలుగు సంవత్సరాలు ఇన్స్ పెక్టర్ గా పని చేశారు. ఇటీవల ఐజీ కార్యాలయంలో పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న శ్రీనివాస్ కు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు అటాచ్డ్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెల్సిందే. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 4వ టౌన్, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లకు ఎస్ హెచ్ వో లుగా సర్కిల్ ఇన్స్ పెక్టర్లను అప్ గ్రేడేషన్ ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో ఈ రెండు పోలీస్ స్టేషన్ లకు ఇటీవల సిఐలను నియమించారు. గురువారం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో (ఎస్సై) ఆరీఫ్ నుంచి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ స్టేషన్ అధికారులు స్వాగతం పలికారు. ఎస్ హెచ్ వో గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ తదుపరి ఉన్నతాధికారులను కలిసారు.