ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

బతుకమ్మ బోధన్: వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా బోధన్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో గల శ్రీ నగరేశ్వర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జన్మోత్సవాన్ని బుధవారం రోజు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జయంతి సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి అమ్మవారికి విశేష పూజలు, అష్టాదశ దశ పండ్ల రసాలతో అభిషేకం, పంచామృత అభిషేకం, నూతన వస్త్రాలతో అలంకరణ, పుష్పార్చనలు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కుంకుమార్చన, పూల అర్చన చేయడంతో పాటు భజనలు, కీర్తనలు ఆలపించారు. వేడుకలకు...