Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 6:24 pm Posted by : ramakrishna

ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

బతుకమ్మ బోధన్: వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా బోధన్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో గల శ్రీ నగరేశ్వర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జన్మోత్సవాన్ని బుధవారం రోజు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జయంతి సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి అమ్మవారికి విశేష పూజలు, అష్టాదశ దశ పండ్ల రసాలతో అభిషేకం, పంచామృత అభిషేకం, నూతన వస్త్రాలతో అలంకరణ, పుష్పార్చనలు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కుంకుమార్చన, పూల అర్చన చేయడంతో పాటు భజనలు, కీర్తనలు ఆలపించారు. వేడుకలకు హాజరైన భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, శక్కర్‌నగర్, కొత్త బస్టాండ్, ఎల్‌బీఎస్‌నగర్, రాకాసిపేట్, పోస్ట్ ఆఫీస్ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు కొత్త రాజేశ్వర్, గంజి వెంకటేశం, పబ్బ మురళి, కంటాల రమేష్, కన్నె సంతోష్, వాసర గంగాధర్, గంగం కిరణ్, పార్శి శ్రీధర్ తదితరులు కీలక పాత్ర పోషించారు.

Sri Vasavi Kanyaka Parameshwari Jayanti celebrations in grand style